చెప్పులు పంపించు, మోస్తా: రెవంత్ రెడ్డికి శైలజానాథ్

దళితుడిపై దాడి చేసి హరీష్ రావు దొరతనం చూపించారని అన్నారు. ఏ ఉద్యమం అయినా అహింసాయుత పద్ధతిలో జరగాలని సూచించారు. తెలుగుదేశం పార్టీ నేత పయ్యావుల కేశవ్ ఆత్మాహుతి దాడులు చేస్తామన్న వ్యాఖ్యలను ఖండించారు. ఆత్మాహుతి దాడులు సరికాదన్నారు. ఎపి భవన్ అధికారులు చట్టవిరుద్దంగా ఆదేశాలు ఇస్తే చర్యలకు సిద్ధమని అన్నారు. తెలంగాణ ముసుగులో భూస్వామ్యాన్ని తెర పైకి తీసుకు వస్తున్నారని ఆరోపించారు. ఏడాదిన్నరగా దళితులపై దాడులు తీవ్రమవుతున్నాయన్నారు.












Click it and Unblock the Notifications