మధు యాష్కీ అమెరికా వెళ్లడం సరికాదు: నాగం

తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీలు ఏం సాధించాయని జెండా పండుగలు చేసుకుంటున్నాయని ప్రశ్నించారు. ఒకసారి రాజీనామాలు చేసిన టిడిపి, కాంగ్రెసు ప్రజాప్రతినిధులు మరోసారి రాజీనామాలు చేయడానికి మల్లగుల్లాలు ఎందుకు పడుతున్నారని ప్రశ్నించారు. మధుయాష్కీకి చిత్తశుద్ధి ఉంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి ముందు ఆందోళన చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు రోజులు పత్రికలలో ప్రకటనలతో సరిపెట్టి అమెరికా వెళ్లడం సరికాదన్నారు. తెలంగాణ కోసం ప్రజాప్రతినిధులంతా మళ్లీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు నాగం జనార్దన్ రెడ్డి ఆయన బృందం సీల్డు కవరులో తమ రాజీనామాలు పెట్టి అసెంబ్లీ సెక్రటరీకి ఇచ్చారు.












Click it and Unblock the Notifications