వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, మన్మోహన్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

|
Google Oneindia TeluguNews

Sonia Gandhi
నల్గొండ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి చిదంబరంపై భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు మంగళవారం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నల్గొండ పట్టణంలోని టూటౌన్ పోలీసు స్టేషన్‌లో బిజెవైఎం విద్యార్థులు సోనియా తదితరులపై చీటింగ్ చేశారని ఫిర్యాదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఇస్తామని ప్రకటన చేసి ఆ తర్వాత వెనక్కి తగ్గటం ద్వారా తెలంగాణ విద్యార్థులు ఆత్మహత్యలకు కారణమయ్యారని వారు ఆరోపించారు. 2009లోని కాంగ్రెసు పార్టీ మేనిఫెస్టోలో తెలంగాణ ఇస్తామని చెప్పి ఆ తర్వాత ఇవ్వక పోవడాన్ని వారు ప్రశ్నించారు. భారతీయ జనతా యువ మోర్చా కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2009 డిసెంబర్ 9న కేంద్ర మంత్రి సోనియా పుట్టిన రోజు కానుకగా అంటూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పి ఆ తర్వాత సీమాంధ్ర ప్రజా ప్రతినిధుల రాజీనామాల బెదిరింపులతో డిసెంబర్ 23న ప్రకటనపై వెనక్కి తగ్గారని అన్నారు. అది సరికాదన్నారు. వెంటనే కేంద్రం తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.

English summary
BJYM activists complainted against AICC president Sonia Gandhi and Prime Minister Manmohan Singh today at Nalgonda two town police station.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X