తెలంగాణపై మా అభిప్రాయం అదే, మళ్లీ లేదు

Chandrababu Naidu
తిరుపతి: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం విషయంలో తెలుగుదేశం పార్టీ అభిప్రాయం గత మహానాడు సందర్భంగా చెప్పామని మళ్లీ చెప్పవలసిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం తిరుపతిలో అన్నారు. తెలంగాణ అంశం కాంగ్రెసు చేతిలో ఉందన్నారు. మా అభిప్రాయం మళ్లీ చెప్పాల్సిన పని లేదన్నారు. కేంద్రం చర్చలకు పిలిస్తే మళ్లీ వెళ్లేది లేదని తేల్చి చెప్పారు. తెలంగాణ సమస్యను సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తన నిజాయితీ నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అవినీతిపై పార్టీలన్నీ యుద్ధం ప్రకటించాలని కోరారు. నేతలు నిజాయితీగా వ్యవహరించాలని సూచించారు. 2జి కుంభకోణంలో ప్రధాని బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా అంతకుముందు చంద్రబాబు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీపై ధ్వజమెత్తారు. బుధవారం తిరుపతిలో సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన అఖిల భారత రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. ఉత్తర ప్రదేశ్‌లో పర్యటించిన రాహుల్ గాంధీ రైతులపై మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని రైతులు రాహుల్ గాంధీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో వ్యవసాయం పరిస్థితి ఆయనకు కనిపించడం లేదా ఎపి రైతులంటే రాహుల్‌కు అంత చిన్న చూపా అన్నారు. కేంద్రం స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తేనే రైతాంగం సుభిక్షంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. స్వాతంత్ర్యం వచ్చాక రైతులు మొదటిసారి పెద్ద ఎత్తున పంట విరామాన్ని ప్రకటించే స్థితికి ప్రభుత్వం తీసుకు వచ్చిందని విమర్శించారు. ప్రస్తుతం వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పూర్తి అవినీతిలో కూరుకు పోయాయని, అవినీతి సొమ్ము వ్యవసాయంలో పెడితే బావుండేదన్నారు. పార్లమెంటులో అన్ని పార్టీలు కలిసి రైతు సమస్యలను లేవనెత్తాలని సూచించారు.

రాష్ట్రంలో చేతకాని ప్రభుత్వం ఉందన్నారు. రైతు కుటుంబాలకు నెలకు రెండు వేల రూపాయలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో ఇష్టం వచ్చినట్లు భూములను కట్టబెడుతున్నారని ఆరోపించారు. భూసేకరణ చట్టాన్ని మార్చాలని అన్నారు. రైతులకు టిడిపి నిత్యం అండగా ఉంటుందన్నారు. ప్రభుత్వాన్ని స్తంభింపజేసి అయినా సమస్యలను పరిష్కరింప జేస్తామని అన్నారు. పెట్రోలు, నిత్యావసర వస్తువుల పెంపుపై పెట్టే శ్రద్ద వ్యవసాయ రంగంపై కేంద్రం పెట్టడం లేదని ఆరోపించారు. రైతులకు గిట్టుబాటు ధరలు లేక విలవిలలాడుతున్నారని అన్నారు. రైతులకు అన్ని విధాలా న్యాయం జరిగేలా ప్రభుత్వాలు పని చేయాలని అన్నారు. పరిశ్రమల పేరుతో భూములు తీసుకుంటున్న కంపెనీలు వాటిని రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగించుకుంటున్నాయని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+