హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా వద్దే వద్దు: కావూరి

ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుందన్నారు. అలాగే తెలంగాణ సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు. రాష్ట్రం సమైక్యాంగా ఉంటేనే బావుంటుందని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు అందరూ అభిప్రాయపడుతున్నారన్నారు. చిన్న రాష్ట్రాలు అడిగే వారు చత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే తెలంగాణ వస్తుందా అని ప్రశ్నించారు. అలాగైతే తామూ రాజీనామాలు చేసి కృష్ణా జిల్లాను రాష్ట్ర్రంగా ప్రకటిస్తే రాష్ట్రం ఇస్తారా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజాప్రతినిధులు అక్కడి ప్రజల అభిప్రాయం మేరకే రాజీనామాలు చేశారన్నారు.












Click it and Unblock the Notifications