సీమాంధ్ర కావూరిని తిట్టిపోసిన పొన్నం ప్రభాకర్, గుత్తా

కాగా పొన్నం ప్రభాకర్ తెలుగుదేశం పార్టీపైనా తీవ్ర విమర్శలు చేశారు. అధికార పార్టీ తెలంగాణపై ఎప్పుడూ తన నిర్ణయం చెప్పలేదన్నారు. ఇప్పుడు కూడా చెప్పదన్నారు. ప్రతిపక్ష పార్టీగా టిడిపికి తెలంగాణపై చెప్పవలసిన బాధ్యత ఉందన్నారు. మొదట టిడిపి తన అభిప్రాయం చెప్పి ఆ తర్వాత కాంగ్రెసును ప్రశ్నించాలన్నారు. అంత వరకు కాంగ్రెసును ప్రశ్నించే హక్కు లేదన్నారు. టిడిపి కేంద్రానికి తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే ఆ తర్వాత రాష్ట్రం ప్రకటించకుంటే కాంగ్రెసు తప్పు అవుతుందని చెప్పారు. కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ చర్చల పేరుతో కాలాయాపన చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. కేంద్రం తెలంగాణ ప్రకటించాక టిడిపి వంటి పార్టీలు యూటర్న తీసుకున్నాయన్నారు. సీమాంధ్ర వారిది కృత్రిమ ఉద్యమం అన్నారు.












Click it and Unblock the Notifications