మోహన్ నా భార్యను వేధిస్తేనే మోహన్‌ను చంపా

కాగా టిఎన్ఎస్ఎఫ్ నేత మోహన్ రాత్రి సమయంలో ద్విచక్ర వాహనంపై వెళుతుండగా లిఫ్ట్ అడిగి ఆయనను దారుణంగా చంపేసిన విషయం తెలిసిందే. దానిని నిందితులు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. పోస్టు మార్టం చేసే వరకు నాగరాజుతో సహా నిందితులు అందరూ విజయవాడలోనే ఉన్నప్పటికీ మోహన్‌ది హత్య అనే అనుమానాలు రావడంతో వారు నగరాన్ని వదిలి వెళ్లారు. వారు కొన్ని రోజులు హైదరాబాదులోని హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్నారు. బుధవారం రాత్రి హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లేందుకు భద్రాచలంలో ఆగారు. ఫోన్ ట్యాపింగ్ ద్వారా పోలీసులు నిందితులను గుర్తించి భద్రాచలంలో నాగరాజు, ఆయన భార్య నళినితో సహా ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.












Click it and Unblock the Notifications