నా వెంట దేవుడున్నాడు, చల్లగా చూస్తాడు: జగన్

YS Jagan
కర్నూలు: ఏ నాయకుడిలో లేని నిజాయతీ ఉందని, దేవుడు తన వెంట ఉన్నాడని, అన్ని విషయాల్లో దేవుడు చల్లగా చూస్తాడని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గురువారం పదకొండో రోజు కర్నూలు జిల్లాలో తన ఓదార్పు యాత్రను కొనసాగించారు.ఆదోనీలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఇదే సీబీఐ విచారణపై స్టే తెచ్చుకున్నారని, అప్పట్లో ఇదే సీబీఐని కాంగ్రెస్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ అని చెప్పారని, ఇప్పుడు అదే చంద్రబాబు అదే సీబీఐతో విచారణ చేయాలని అడగడం విడ్డూరంగా ఉందని ఆయన అన్నారు.

తల్లీకొడుకులను అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా అధికారంలోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ రాజకీయ శత్రువులైనా, ప్రస్తుతం ఇద్దరు నేతలూ సోనియా అడుగుజాడల్లోనే నడుస్తున్నారని అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిని అప్రతిష్ట పాలు చేసేందుకు కాంగ్రెసు, టిడిపి కుమ్మక్కయి కుట్ర చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ప్రజల గుండెల్లో నిలిచి ఉండడమే వైయస్సార్ చేసిన నేరమా అని ఆయన ప్రశ్నించారు.రెండెకరాల చంద్రబాబుకు వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయని ఆయన ప్రశ్నించారు. తనను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెసు ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆయన విమర్శించారు వైయస్సార్ కుటుంబం ఒంటరి అనుకుంటే కాంగ్రెసు, టిడిపిలు పొరపాటు చేసినట్లేనని ఆయన వ్యాఖ్యానించారు.

తనకు, తన తల్లి వైయస్ విజయమ్మకు దేవుడి దయ, వైయస్సార్ ఆశీస్సులు, తనను ప్రేమించేవారి అండ ఉన్నాయని ఆయన అన్నారు. ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి జగన్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. జగన్‌ వెంట భూమానాగిరెడ్డి, బాలనాగిరెడ్డి, సాయిప్రసాద్‌రెడ్డి, మారెప్ప ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+