లక్షలాది మందికి టోకరా ఇచ్చిన ఆన్‌లైన్ కంపెనీ

సింగపూర్‌కు చెందిన కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఒఒ) తారక్ బాజ్‌పేయిని ముంబై పోలీసులు ఇండోర్‌లో గురువారం రాత్రి అరెస్టు చేశారు. రూ. 2,100 కోట్ల అక్రమాలకు గాను ఈ అరెస్టు జరిగింది. ఈ కంపెనీపై విజయవాడకు చెందిన ఎన్‌జివో కార్పొరేట్ ఫ్రాడ్ వాచ్ రెండు నెలల క్రితం ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. సిఐడి పోలీసులు ఎంఎస్ స్వామి, శ్రీనివాస రెడ్డి అనే ఇద్దరు స్పీక్ ఆసియా ఏజెంట్లను అరెస్టు చేశారు. అయితే, వారి అరెస్టుపై కోర్టు స్టే ఇచ్చింది. తాము స్టే తొలగింపునకు అపీల్ చేశామని సిఐడి అదనపు డిజి ఎస్వీ రమణమూర్తి చెప్పారు.












Click it and Unblock the Notifications