ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో ప్రేమోన్మాది దాడి
Districts
oi-Pratapreddy
By Pratap
|
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ఓ ప్రేమోన్మాది తన క్లాస్‌మేట్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థినిని ఆస్పత్రిలో చేర్చారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్ఎస్ఎన్ కాలేజీలో నాగార్జున, అనురాధ చదువుతున్నారు. తనను ప్రేమించాలని నాగార్జున అనురాధ వెంట పడుతూ వచ్చాడు. కాదని ఎంత చెప్పినా వినలేదు. అనురాధ తల్లిదండ్రులు నాగార్జునను మందలించారు కూడా.
అకస్మాత్తుగా నాగార్జున శనివారంనాడు అనురాధపై కత్తితో దాడి చేశాడు. తనను ప్రేమించడం లేదనే కోపంతో అతను ఈ దాడికి పాల్పడ్డాడు. నాగార్జునను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము ఇంత పని జరుగుతుందని అనుకోలేదని అనురాధ తల్లిదండ్రులు బోరుమంటున్నారు. అనురాధ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ చదువుతోంది.