జయలలిత ప్రతాపం, మాజీ డిసిఎం స్టాలిన్ అరెస్టు

తిరువరూర్ జిల్లా కార్యదర్సి పూండీ కలైవనన్ అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించడంతో స్టాలిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పాఠశాల విద్య అభ్యసిస్తున్న విద్యార్థులందరికీ ఏకీకృత విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కలైవనన్ విద్యాసంస్థల బహిష్కరణకు దిగారు. దీంతో ఆయనపై పోలీసులు కేసు పెట్టారు. తమ పార్టీ నేతలపై ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయిస్తోందని స్టాలిన్ విమర్శించారు.
తన కుమారుడు స్టాలిన్‌ను అరెస్టు చేయడంపై డిఎంకె అధినేత కరుణానిధి తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆయన అన్నారు. ప్రభుత్వ కిరాతక చర్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్త నిరసనలు జరుపుతామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications