రాయపాటి, లగడపాటి ఖల్ నాయక్‌లు: హరీష్ రావు

సీమాంధ్ర నాయకులకు మానవత్వం కూడా లేదని, తెలంగాణలో 600 మంది విద్యార్థులు మరణిస్తే మాట్లాడడం లేదని ఆయన అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ మృతికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం కూడా ప్రకటించలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావుకు తెలుసునని ఆయన అన్నారు. సైన్స్ సిటీని, గిరిజన విశ్వవిద్యాలయాన్ని సీమాంధ్రలో పెడుతున్నారని, తెలంగాణను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆయన అన్నారు. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి పురంధేశ్వరి వాటిని సీమాంధ్రకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications