• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

వరంగల్లులోని నిజాం విమానాశ్రయంపై చిన్నచూపు

By B N Sharma
|

Warangal
వరంగల్: స్వాతంత్రానికి పూర్వం నిజాములచే వరంగల్ జిల్లాలోని మామ్ నూర్లో నిర్మించబడిన అతి పెద్ద ఎయిర్ పోర్ట్ అధికార్ల నిర్లక్ష్యానికి గురై త్వరలో అదృశ్యం కానుంది. స్ధానిక నివాసులు ఎయిర్ పోర్ట్ ను అభివృద్ధి చేయాలని ప్రస్తుత ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా పరిధిలోకి తీసుకు రావాలని వివాదిస్తున్నప్పటికి రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కార్పొరేషన్ తో లాలూచీ పడి ఆ ప్రదేశాన్ని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించాలని చూస్తున్నారు.

వరంగల్ పార్లమెంటు సభ్యుడు సైతం ఈ స్ధలాన్ని హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లి. సంస్ధకు అప్పగించటానికి సిఫార్సు చేస్తున్నాడు. ఈ భూమిని హిందుస్తన్ ఏరోనాటిక్స్ లి. సంస్దకు బదిలీ చేయాల్సిందిగా ప్రిన్సిపాల్ సెక్రటరీ ఆఫ్ ఇండస్ట్రీస్ కు లేఖ రాయవలసిందిగా తనను కోరినట్లు గా కూడా జిల్లా కలెక్టర్ బి. రాహుల్ ధృవపరిచారు.

అధికార్లు చేపట్టే చర్యలకు నిరసనగా గురువారం నాడు వందలాది మహిళలు మామ్ నూర్ ఎయిర్ పోర్ట్ రన్ వే పై ర్యాలీ నిర్వహించి నిరసనగా రంగోలి ముగ్గులు వేశారు. వీరంతా సీమాంధ్ర నేతలకు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రజలను వీరు మోసగిస్తున్నారన్నారు. ఎయిర్ పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా గతంలో మామ్ నూర్, కడప ఎయిర్ పోర్ట్ లను అభివృద్ధి చేయటానికి 30 మార్చి, 2007 న ఒక అవగాహనా పత్రాన్ని సంతకం చేసింది. అయితే, కడప ఎయిర్ పోర్టు పై మాత్రమే దృష్టి పెట్టింది.

మామ్నూర్ ఎయిర్ పోర్ట్ ను 1930 లో నిజాం నవాబు షోలాపూర్ ఎయిర్ పోర్ట్ తో పాటుగా వ్యాపార అవసరాలకు గాను నిర్మించాడు. సిర్పూర్ కాగజ్ నగర్ పేపరు మిల్లు అవసరాలకు షోలాపూర్ ఎయిర్ పోర్టు అజాం జాహి మిల్స్ లాంటి వరంగల్ చుట్టు పక్కల గల పరిశ్రమల అవసరాలకు మామ్ నూర్ ఎయిర్ పోర్టు వినియోగ పడేవి. ఆ కాలంలో, మామ్ నూర్ ఎయిర్ పోర్టు దేశంలోనే అతి పెద్దది. 1875 ఎకరాలలో 6.6 కి.మీ. రన్ వేతో నిర్మించబడింది. ఇందులో పైలట్ కు విమాన సిబ్బందికి నివాస భవనాలు, ఒక పైలట్ ట్రైనింగ్ సెంటర్, ఒకటికంటే అధికమైన టర్మినల్ కూడా వున్నాయి. 1981 వరకు సర్వీస్ లోనే వుండేది.

1981 వరకు అనేక మంది ప్రధానమంత్రలు, ప్రెసిడెంట్లు కూడా యిందులో దిగేవారు. ఇండో - చైనా యుద్ధ సమయంలో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ టార్గెట్ కావడంతో ఈ ఎయిర్ పోర్ట్ ను ప్రభుత్వ ఎయిర్ క్రాఫ్ట్ కొరకు కూడా ఉపయోగించారు. వాయుదూత్ విమానాలు ఇతర లగేజి విమానాలు కూడా ఈ ఎయిర్ పోర్టు ను వినియోగించాయి.

English summary
The airport at Mamnoor was established in 1930 by the Nizam nawab, along with one at Sholapur to benefit the businesses, at Sirpurkagaznagar for the paper industry's convenience, and to help industries like the Azam Zahi mills at Warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X