వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిల్లు కోసం అమెరికా అధ్యక్షుడు ఒబామా తిప్పలు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

Barack Obama
ఆగస్టు 2వ తేదిన రుణ సేకరణ గరిష్ట పరిమితి బిల్లు కోసం గడువు దగ్గర పడుతోంది. దీంతో అమెరికా ప్రభుత్వంలో టెన్షన్ పెరిగిపోతోంది. ఈ విషయం కేవలం అమెరికానే కాదు. ప్రపంచ దేశాలన్నీ ఈ అంశంపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి. దివాలా కాకుండా బయట పడేందుకు సహకరించాలని మార్గాలు అన్వేషించాలని ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా విజ్ఞప్తుల మీద విజ్ఞప్తులు చేస్తున్నారు. చివరి ప్రయత్నంగా, తమ తమ ప్రజా ప్రతినిధులకు ఫోన్ లేదా ఈ మెయిల్ లేదా ట్వీట్ చేసి చెప్పాల్సిందిగా అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. రుణ సమీకరణ గరిష్ఠ పరిమితి బిల్లుపై ప్రతిష్టంభన వీడడం లేదు. బిల్లు విషయంలో ఎవరి దారి వారిదే. డెమోక్రాట్లు అనుకూలంగా ఉంటే రిపబ్లికన్లు ససేమిరా అంటున్నారు. పట్టు వీడేందుకు, మెట్టు దిగేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. ఈ నేపథ్యంలోనే ఈ బిల్లును శుక్రవారం హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో ప్రవేశపెట్టారు. ఇక్కడ రిపబ్లికన్లదే ఆధిక్యం.

దీంతో, ఈ సమస్యకు సత్వర పరిష్కారం కనుచూపు మేరలో కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే, సెనేట్‌లోని డెమోక్రటిక్ లీడర్ హ్యారీ రీడ్ రుణ గరిష్ఠ పరిమితి తగ్గింపు ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. తాజా ప్రతిపాదనతో 2012 ఎన్నికల వరకు మూడు దశల్లో రుణ గరిష్ఠ పరిమితిని పెంచుకునే అధికారం ఒబామాకు దఖలు పడుతుంది. అయితే, దీనికీ అంగీకారం కుదిరే పరిస్థితి కనిపించడం లేదు. తమతో చర్చలకు వా రు సుముఖంగా లేరని ఓటింగ్ తర్వాత రీడ్ వాపోయారు. కాగా రుణ సేకరణ గరిష్ఠ పరిమితి బిల్లు నేపథ్యంలో ఒబామా అధికారం చేపట్టిన తర్వాత తొలిసారిగా వ్యక్తిగతంగా ఆయన జాబ్ అప్రూవల్ రేటింగ్ 40 శాతానికి పడిపోయింది.

విజ్ఞప్తులు ఫలించకపోవడంతో ఒబామా తుది యత్నాలకు దిగారు. బిల్లుపై ఓ ఒప్పందానికి రావాల్సిందిగా తమ తమ కాంగ్రెస్ సభ్యులకు చెప్పాలంటూ అమెరికన్లకు పిలుపునిచ్చారు. పార్టీ ప్రయోజనాలకు పెద్దపీట వేసే సమయం దాటిపోయింది. ఉభయ పక్షాలూ ఒప్పందానికి రావాలని మీరు కోరుకుంటే ఆ విషయాన్ని కాంగ్రెస్‌కు ఫోన్ ద్వారా తెలపండి. ఈ మెయిల్ పం పండి. ట్వీట్ చేయండి' అని ట్విటర్‌లో పిలుపునిచ్చారు. అంతే ఆ అకౌంట్‌లో ఒబామాకున్న లక్షల మంది అభిమానులు ట్వీట్ చేయడం ప్రారంభించేశారు.

English summary
America Barack Obama trying to pass debit limit bill. He urged American public support to pass bill.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X