గోబీ ఎడారిని దాటి అరుదైన ఖ్యాతిని పొందిన సాహాసనారి

రిప్లే డెవన్‌పోర్ట్ నేతృత్వంలోని 13 మంది బృందం గోబీ సాహసయాత్రకు మే 25న శ్రీకారం చుట్టింది. ఇందులో సుచేత కూడా సభ్యురాలు. ఆరోగ్య సమస్యలు, గాయాల బారినపడడంతో బృందంలోని ఆరుగురు సభ్యులు యాత్ర మధ్యలోనే వైదొలిగారు. వీరిలో సుచేత స్నేహితురాలు పుణేకు చెందిన నలంద జోగ్లేకర్ కూడా ఉన్నారు. గోబీ యాత్రను విజయవంతంగా పూర్తిచేసుకుని పుణేకు వచ్చిన సుచేత శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ''గోబీ ఎడారి యాత్ర అత్యంత సాహసంతో కూడుకున్నది. మే 25న మంగోలియాలోని కొంగోరీన్ ఉత్తర ప్రాంతం నుంచి మా యాత్రను ప్రారంభించాం. రోజుకు సగటున 25 నుంచి 32 కిలోమీటర్ల దూరం నడిచాం. ఉదయం భరించలేని ఎండ, రాత్రిపూట భీకర చలిగాలులు, ఇక ఇసుక తుపాన్ల సంగతి సరేసరి.
యాత్రలో ఎన్నో అడ్డంకులు. మధ్యలో అనారోగ్యానికి గురైనా త్వరలోనే తేరుకున్నా"" అని యాత్రానుభవాల్ని ఆమె వివరించారు. గోబీ సాహసయాత్రకు ముందే ప్రతి రోజు తన ఇంటినుంచి ఆఫీసుకు సుమారు 24 కిలోమీటర్ల మేర నడిచి వెళ్లేదాన్నని తెలిపారు. ఆ విధంగా నడకను అలవర్చుకున్నానని వెల్లడించారు. ఐర్లాండ్‌కు చెందిన రిప్లే డెవన్‌పోర్ట్ వద్ద ప్రత్యేకంగా శిక్షణ పొందినట్లు చెప్పారు. భూటాన్ నుంచి పాకిస్థాన్ వరకు విస్తరించి ఉన్న హిమాలయాలను దాటడమే తన తదుపరి లక్ష్యమని ఆమె ప్రకటించారు.












Click it and Unblock the Notifications