వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సమావేశాలకు వెళ్లేది లేదు: టి-కాంగ్రెసు ఎంపీలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Keshava Rao and Ponnam Prabhakar
హైదరాబాద్: కేంద్రం తెలంగాణపై సానుకూల వైఖరి ప్రకటించకుంటే పార్లమెంటు సమావేశాలకు వెళ్లేది లేదని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి గులాం ఆజాద్ రాజీనామాలు ఉపసంహరించుకోవాలని, చర్చలకు రావాలని కోరిన నేపథ్యంలో ఆదివారం టి-ఎంపీలు ఎంపీ మధుయాష్కీ ఇంట్లో భేటీ అయ్యారు. భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఎంపీలమంతా ఏకత్రాటిపైనే ఉన్నామన్నారు. ఎంపీలలో విభేదాలు ఉన్నాయని వస్తున్న వార్తలో నిజం లేదన్నారు.

తాము చిత్తశుద్దితో రాజీనామాలు చేశామన్నారు. తాము రాజీనామాల ఆమోదం కోసం పట్టుబట్టాల్సిన అవసరం లేదన్నారు. రాజీనామాలపై స్పీకర్ మీరా కుమార్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఆమె నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వెలువడితే రాజీనామాల ఉపసంహరణలపై ఆలోచిస్తామనే లేదంటే వాటిపై ఆలోచించమన్నారు. రాజీనామాలపై రాజీ పడే ప్రసక్తి లేదన్నారు. ఒకవేళ కేంద్రం నుండి అనుకూల ప్రకటన రాకున్నా తాము రాజీనామాలు ఉపసంహరించుకుంటే తెలంగాణలో పార్టీ పరిస్థితి ఆత్మహత్య సదృశ్యమే అవుతుందన్నారు.

స్పీకర్ నుండి తమకు పిలుపు రాలేదన్నారు. రాజీనామాలు తిరస్కరిస్తే తెలంగాణ కోసం ఉద్యమిస్తామని చెప్పారు. పార్లమెంటులో తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు. ఈ భేటీలో ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి, వివేక్, మందా జగన్నాథం, బలరాం నాయక్, పొన్నం ప్రభాకర్, కె కేశవ రావు, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana Congress MPs confirmed that they will not ready to go parliament session if centre not respond on Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X