వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం అవుతాననుకోలేదు: యడ్యూరప్ప భావోద్వేగం

By Srinivas
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగళూరు: తాను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదని కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఆదివారం జరిగిన ఓ సభలో భావోద్వేగంతో మాట్లాడారు. ఆదివారం ఉదయం కర్నాటక బలిజ సంఘం యడ్యూరప్పను ఘనంగా సన్నానించింది. ఈ సమయంలో ఆయన సభను ఉద్దేశించి మాట్లాడారు. తాను ముఖ్యమంత్రిని అవుతానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని అన్నారు. తాను ఏ పదవిలో ఉన్నప్పటికీ బిసిలతో సత్సంబంధాలు కొనసాగిస్తానని చెప్పారు.

దేశంలో ఇనుప ఖనిజ రవాణా రద్దు చేసిన ప్రభుత్వం తమదే అని అన్నారు. గనుల అక్రమాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగుకు తాను లేఖ సైతం రాశానని చెప్పారు. రాష్ట్రంలో అవినీతిని అరికట్టడానికి చిత్తశుద్ధితో పని చేశానని అన్నారు. ఇప్పటికే బిజెపి జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీకి రాజీనామాను సమర్పించానని, సాయంత్రం గవర్నర్ భరద్వాజ్‌ను కలిసి రాజీనామా సమర్పిస్తానని చెప్పారు.

కర్నాటక ప్రజలు తనను అభిమానంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుండ బెట్టారన్నారు. ప్రజలు చూపించిన అభిమానంతో సంతోషంగా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్‌కు రాజీనామా సమర్పిస్తానని చెప్పారు. పదవి కోల్పోయినందుకు తాను బాధపడటం లేదన్నారు. ప్రజల్లోకి వెళ్లే అవకాశం వచ్చినందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. పదవికి రాజీనామా చేయడం ద్వారా ప్రజలతో మమేకం అయ్యేందుకు తనకు మంచి అవకాశం వచ్చిందన్నారు.

English summary
Karnataka CM Yeddyurappa said today that he did not think abou cm post any time.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X