హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ మంత్రాలయ ప్రవేశంపై రగడ

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: సంప్రదాయాన్ని అతిక్రమించి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి ఆలయంలోకి ప్రవేశించిన విషయంపై దుమారం చెలరేగుతోంది. ఓదార్పు యాత్ర సందర్భంగా ఇటీవల వైయస్ జగన్ చొక్కాతోనే ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలోకి పురుషులు శరీరం పైభాగంలో దుస్తులు లేకుండా ప్రవేశించాల్సి ఉంటుంది. ఆలయ నిబంధనలను ఉల్లంఘించినందుకు వైయస్ జగన్ క్షమాపణ చెప్పాలని తెలుగుదేశం పార్టీ నాయకుడు పి. చంద్రశేఖర్ డిమాండ్ చేశారు.

నిబంధనలను ఉల్లంఘించడం ద్వారా వైయస్ జగన్ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీశారని ఆయన విమర్శించారు. జగన్ భద్రతా సిబ్బంది, అనుచరులు బూట్లతోనే ఆలయంలోకి ప్రవేశించి నిబంధనలను ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. హిందూ మతంపై విశ్వాసం లేనంత మాత్రాన హిందూ మందిరాలను అపవిత్రం చేయడం జగన్‌కు తగదని ఆయన అన్నారు.

English summary
TDP leader P Chandrasekhar demanded apology from YSR Congress president YS Jagan for entering Mantralayam Raghavendra swami temple violating rules.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X