ఎపి భవన్ కేసులో హరీష్‌కు ఢిల్లీ పోలీసు నోటీసులు

యాదిరెడ్డి మృతదేహాన్ని ఎపి భవన్‌కు తీసుకు రావడానికి అంగీకరించిన సిబ్బంది ఆ తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే చాటుగా నేరుగా హైదరాబాదు పంపించింది. దీంతో ఆగ్రహం చెందిన సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు నేరుగా ఎపి భవన్‌లోకి వెళ్లి ఉద్యోగి చందర్ రావుపై చేయి చేసుకున్నాడు. ఆ తర్వాత తాను ఆవేశంతో మాత్రమే చేశానని అందుకు తాను చింతిస్తున్నానని కూడా చెప్పారు. కాగా నోటీసులపై టిఆర్ఎస్ఎల్పీ ఈటెల రాజేందర్ స్పందించారు. తమపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం సరికాదన్నారు. అట్రాసిటీ కేసు పెట్టే హక్కు లేదన్నారు. తాము ఎవరినీ కులం పేరుతో దూషించలేదన్నారు. తమను జైలు పాలు చేయడానికే ప్రభుత్వం కంకణం కట్టుకొని ఇలాంటి కేసులు పెట్టిస్తుందని ఆరోపించారు. తాము అక్కడకు వెళ్లిన సమయంలో చందర్ రావు కూతురు లేదని అలాంటప్పుడు ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications