దద్ధరిల్లిన పార్లమెంటు ఉభయ సభలు, వాయిదా

భూసేకరణ బిల్లును వెంటనే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాదీ పార్టీ సభ్యులు కూడా ఉత్తరప్రదేశ్ బిఎస్‌పి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని కోరుతూ ఆందోళనకు దిగారు. కొంత మంది ఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి మాయావతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ మీరా కుమార్ సూచించినా సభ్యులు వినలేదు. తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో సభను ఆమె రెండు గంటల వరకు వాయిదా వేశారు . ఆ తర్వాత రేపటికి వాయిదా పడింది.
రాజ్యసభలో ధరల పెరుగుదలపై బిజెపి సభ్యులు ఆందోళనకు దిగారు. అన్నాడియంకె సభ్యుడు ఎ విలియం రబీ బెర్నార్డ్ ప్రమాణం చేసిన వెంటనే బిజెపి సభ్యుడు ఎం వెంకయ్యనాయుడు లేచి ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి ధరల పెరుగుదలపై తక్షణమే చర్చించాలని పట్టుబట్టారు. తాము ఇచ్చిన నోటీసు ఏమైందని ఆయన అడిగారు. నోటీసును అనుమతించలేదని చైర్మన్ హమీద్ అన్సారీ చెప్పారు. దీంతో బిజెపి సభ్యులు చర్చకు పట్టుబట్టారు. భూ సేకరణ వంటి అంశాలను ప్రస్తావిస్తూ ఇతర పార్టీల సభ్యులు కూడా లేచి నించున్నారు. తగిన సమయంలో అన్ని విషయాలపై చర్చిద్దామని అన్సారీ చెప్పినా సభ్యులు వినలేదు. బిజెపి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో సభను అన్సారీ రెండు గంటల వరకు వాయిదా వేశారు. ఆ తర్వాత రేపటి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications