ప్రజల దృష్టిలో చిదంబరం దోషిగా నిలబడ్డారు: పోచారం

Pocharam Srinivas Reddy
హైదరాబాద్: 14ఎఫ్ పై మరోసారి తీర్మానం చేయాలని చెప్పడం ద్వారా కేంద్ర మంత్రి చిదంబరం దోషిగా నిలబడ్డారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింటు వద్ద ఆరోపించారు. చిదంబరం వెంటనే తెలంగాణ ప్రజలు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 14ఎఫ్ రద్దును నీరుగార్చేందుకు కుట్ర చేస్తున్నారని అన్నారు. కుట్ర చేస్తున్న వారి ఆటలు సాగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు 14ఎఫ్ రద్దు చేయించాకే న్యూఢిల్లీ నుండి తిరిగి రావాలన్నారు.

కాంగ్రెసు ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసి వచ్చి ఉద్యమంలో ముందు నిలబడాలని కోరారు. తెలంగాణలో ప్రజలు ఉద్యమం నడిపిస్తుంటే సీమాంధ్రలో నేతలు ఉద్యమాన్ని నడిపిస్తున్నారని అన్నారు. కాంగ్రెసు ఎంపీలు రాజీనామాలు ఆమోదింప చేసుకోవాలి. లేదా తెలంగాణపై కేంద్రం నుండి స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. లేదంటే హైదరాబాదులో అడుగు పెట్టనివ్వమని హెచ్చరించారు. ఢిల్లీ ఎపి భవన్‌లో చందర్ రావుపై దాడి ఉద్దేశ్య పూర్వకంగా చేసింది కాదన్నారు. టిఆర్ఎస్ నేతలపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. తెలంగాణ వాదాన్ని బలహీనపరిచే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.

14ఎఫ్ పై తీర్మానం చేశాక తెలుగుదేశం, ప్రజారాజ్యం, కాంగ్రెసు పార్టీలు తమ వైఖరిని మార్చుకున్న నేపథ్యంలో చిదంబరం మరోసారి తీర్మానం అడుగుతున్నట్లుగా కనిపిస్తోందని మరో నేత వినోద్ కుమార్ టిఆర్ఎస్ భవన్‌లో అన్నారు. 14ఎఫ్ రద్దు చేశాకే ఎస్సై పరీక్షలు నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+