వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శంకరరావు లేఖను విచారణకు స్వీకరించిన లోకాయుక్త

By Srinivas
|
Google Oneindia TeluguNews

P Shankar Rao
హైదరాబాద్: చేనేత, జౌళీ శాఖ మంత్రి శంకరరావు లేఖను లోకాయుక్త విచారణకు స్వీకరించింది. శంకరరావు ఆస్తులపై విచారణ చేస్తామని అందుకు సంబంధించిన వివరాలు వెల్లడించాలని కోరింది. ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యులు, బంధువుల వివరాలు ఆరు వారాలలోగా వివరించాలని కోరింది. అయితే కర్నాటక లోకాయుక్త మాదిరిగా మన లోకాయుక్త సైతం చురుగ్గా పని చేయాలని శంకరరావు సూచించడంపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. రెండు పేజీల ఆ లేఖలో శంకరరావు లేఖను విచారణకు స్వీకరిస్తున్నట్లు చెప్పటమే కాకుండా కర్నాటక లోకాయుక్తతో పోల్చడంపై సమాధానం చెప్పింది. ఒక మంత్రి స్థానంలో ఉన్న శంకరరావుకు ఎపి లోకాయుక్తకు సర్వాధికారాలు లేవనే విషయం తెలియదని అనుకోవడం లేదని అన్నారు.

కర్నాటక లోకాయుక్తకు సంపూర్ణ అధికారాలు ఉన్నాయని ఎపి లోకాయుక్తకు అవి లేవని లేఖలో స్పష్టం చేశారు. చాలా రోజులుగా తమకు విశేష అధికారాల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని చెప్పారు. కాగా మంత్రి శంకరరావు ఆరు వారాల తర్వాత పూర్తి నివేదిక ఇస్తారని ఆ తర్వాత మరింత లోతుగా తాము విచారణ జరిపిస్తామని లోకాయుక్త చెప్పింది. కాగా తనపై పలువురు అవినీతి ఆరోపణలు చేస్తున్నారని తనపై, తన కుటుంబ సభ్యులపై విచారణ జరిపించాలని రెండు రోజుల క్రితం శంకరరావు లోకాయుక్తకు లేఖ రాసిన విషయం తెలిసిందే.

English summary
Lokayukta accepted minister Shankar Rao's letter and ordered to give report on his property. Lokayukta also asked his family and relations details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X