వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం రేసులో సదానంద గౌడ, జగదీష్ షెట్టర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Jagadish Shettar-Sadanand Gowda
బెంగళూరు: తాను తిరిగి ముఖ్యమంత్రిని అవుతానని, ఆరు నెలల్లో తాను తిరిగి రావడం ఖాయమని కర్ణాటక ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప అంటున్నారు. అయితే ప్రస్తుతానికి ఆయన దిగిపోయి, కొత్త ముఖ్యమంత్రి ఎంపిక అనివార్యంగా మారింది. ముఖ్యమంత్రి ఎంపిక బుధవారం ఓ కొలిక్కి రావచ్చునని భావిస్తున్నారు. ఈ పదవి కోసం సదానంద గౌడ, జగదీష్ షెట్టర్ పోటీ పడుతున్నారు. సదానంద గౌడ యడ్యూరప్ప మనిషి కాగా, షెట్టర్ ఆయన ప్రత్యర్థి వర్గానికి చెందిన అనంతకుమార్ గ్రూపునకు చెందినవారు.

తనకు 70 మందికి పైగా శాసనసభ్యుల బలం ఉన్నప్పటికీ తమ బిజెపి అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి రాజీనామా చేశానని, అయితే తాను సూచించిన నాయకుడికే ముఖ్యమంత్రి పీఠం కట్టబెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా సదానంద గౌడ పేరు ముందుకు వచ్చింది. జగదీష్ షెట్టర్, సదానంద గౌడ గ్రూపులు వేర్వేరుగా హోటళ్లలో సమావేశమై తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. యడ్యూరప్ప అధిపత్యాన్ని దెబ్బ తీయడానికి లింగాయత్ వర్గానికి చెందిన జగదీష్ షెట్టర్‌ను ముఖ్యమంత్రిని చేయాలని అనంత కుమార్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు.

English summary
BS Yeddyurappa vows he shall be back soon. But that's for later. Karnataka needs a Chief Minister immediately and the BJP is expected to decide today on who that person shall be. By vote. The two men said to be forerunners for the post: Mr Yeddyurappa's man Sadanand Gowda and Jagadish Shettar, who belongs to the rival camp of Ananth Kumar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X