హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రామోజీ రావుపై దుమ్మెత్తిపోసిన జగన్ సాక్షి డైలీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Sakshi Daily
హైదరాబాద్: ఈనాడు దినపత్రిక అధిపతి రామోజీ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి డైలీ దుమ్మెత్తిపోసింది. ఈ మేరకు బుధవారం ఓ వార్తాకథనాన్ని ప్రచురించింది. పాతికేళ్ల కిందట వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబంపై తెలుగుదేశం, దాని అనుబంధ మీడియా మొదలు పెట్టిన విద్వేషపూరిత దాడులకు కొనసాగింపు తమపై దాడిగా సాక్షి వ్యాఖ్యానించింది. సాక్షిలో పెట్టుబడులు, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తులపై మూడేళ్లకు పైగా రాష్ట్రంలో చర్చ జరుగుతోందని, ఈ చర్చను లేవదీసిన ఈనాడు, తెలుగుదేశం పార్టీల ఉద్దేశాలు అందరికీ తెలిసినవేనని వ్యాఖ్యానించింది. ఎవరి బాగు కోసం ఈనాడు రాస్తుంది, ఎవరి ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు రాజకీయాలు నడుపుతున్నారనే ప్రశ్నలకు ప్రత్యేకించి సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది.

తమకు దీటుగా నిలబడి, వారి గట్టు రట్టు చేస్తున్నందుకే వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం సాగుతోందని సాక్షి వార్తాకథనం ముఖ్య సారాంశం. వైయస్‌ను చెరిపేయడానికి కాంగ్రెసు నాయకులు చంద్రబాబుతో జత కట్టారని విమర్శించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఉటంకిస్తూ ప్రభుత్వం వాటిని అమలు చేయలేని స్థితిలో ఉందని విమర్శించింది. వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చట్టబద్దం కాని లబ్ధి చేకూర్చడం వల్లనే, వారికి ఎన్నో ప్రత్యేక మినహాయింపులు ఇచ్చినందువల్లనే, అందుకు ప్రతిఫలంగా సాక్షిలో వారు పెట్టుబడులు పెట్టారని వాదిస్తున్నారని, ఈ వాదన చేస్తున్న వ్యక్తులు మొదట నిరూపించాల్సింది వైయస్ నేతృత్వంలోని మంత్రి మండలి, అందులోనూ ప్రత్యేకంగా వైయస్ ఇలా రూల్ బుక్‌ను ఉల్లంఘించి ఏ పారిశ్రామిక సంస్థకైనా ప్రత్యేక ప్రయోజనం కలిగించారా అన్నది అంటూ చంద్రబాబు చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలుచేసింది.

English summary
YSR Congress party president YS Jagan Sakshi daily has attacked Eenadu chairman Ramoji Rao and TDP president N Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X