చిరు దయతో గెలిచాం, జగన్‌పై కెవిపి మాట్లాడాలి: విహెచ్

కోట్ల కుంభకోణంలో మంత్రివర్గం సమష్టి బాధ్యత అంటున్న వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలపై నాటి మంత్రివర్గం వెంటనే స్పందించాలన్నారు. పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణ ఒక్కరే స్పందించారని మిగిలిన వారూ తమ బాధ్యత లేదని స్పష్టం చేయాలన్నారు. మంత్రివర్గంలో తీసుకునే నిర్ణయాలలో ముఖ్యమంత్రిదే ఫైనల్‌గా ఉంటుందని చెప్పారు. నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలిపినప్పటికీ లాలూచి పడిన విషయం మంత్రులకు తెలవాల్సిన అవసరం లేదని ఆ విషయం వారు వెంటనే చెప్పాలన్నారు. వైయస్ హయాంలో మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి నిర్ణయాలను వ్యతిరేకించే అయినా అవి అమలులోకి వచ్చాయన్నారు. ఆయన మీడియా ముందు ఆ విషయం చెప్పారన్నారు.
ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడితే కేబినెట్ నుండి తొలగిస్తారన్న జెసి దివాకర్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవమేఅన్నారు. మిగిలిన మంత్రులూ ఆయనను అనుసరించాలన్నారు. తాను వైయస్ ముందే ఆయన గురించి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు. మంత్రి శంకర్ రావుకు బెదిరింపు కాల్సు వస్తున్నప్పటికీ భయపడేది లేదన్నారు. హైకమాండ్ ఏవైనా తప్పులు తమ దృష్టికి వస్తే చూస్తూ ఊరుకోదన్నారు. వైయస్ జగన్ వ్యాఖ్యలపై కెవిపి రామచంద్రా రావు బయటకు వచ్చి మాట్లాడాలని అన్నారు. కెవిపి బయటకు వచ్చి జగన్‌కు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. వైయస్ చేసినవన్నీ కెవిపికి తెలుసన్నారు. తన ఉద్దేశ్యం ప్రకారం కెవిపియే అన్నీ తానై నడిపారని అన్నారు.












Click it and Unblock the Notifications