ముఖ్యమంత్రి కిరణ్ పదవికి గ్యారంటీ లేదు: కెటిఆర్

డిసెంబర్ 9న తెలంగాణకు అనుకూలంగా వచ్చిన ప్రకటనకు పార్టీల ఆందోళన కారణం కాదన్నారు. టిఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు దీక్ష, లక్షలాదిగా మద్దతు పలికిన విద్యార్థులు, ఉద్యోగులు, తెలంగాణ ప్రజలే నాటి ప్రకటనకు కారణం అన్నారు. రాజీనామాలు చేసిన వారు వాటిని ఆమోదించుకుంటేనే తెలంగాణ వస్తుందని చెప్పారు. అవసరమైన పక్షంలో పార్టీని వీడేందుకు సైతం సిద్ధంగా ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణపై ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. దేశాన్ని పాలిస్తున్న పార్టీ అధినేత్రిగా ఆమే బాధ్యత ఉందన్నారు.












Click it and Unblock the Notifications