వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభలో లోక్‌పాల్ బిల్లు, బయట ప్రతుల దగ్ధం

By Pratap
|
Google Oneindia TeluguNews

Anna Hazare
న్యూఢిల్లీ: లోక్‌పాల్ బిల్లును మంత్రి సల్మాన్ ఖుర్షీద్ గురువారం లోకసభలో ప్రతిపాదించారు. బిల్లుకు నిరసనగా అన్నా హజారే బృందం ప్రభుత్వ బిల్లు ప్రతులను దగ్ధం చేసింది. ఈ నెల 16వ తేదీన అన్నా హజారీ దీక్షను ప్రారంభించేవరకు ఇటువంటి ప్రతీకాత్మక నిరసన కార్యక్రమాలు జరుగుతాయని అన్నా బృందం చెబుతోంది. లోక్‌పాల్ పరిధిలోకి ప్రధానిని తేవాల్సిందేనని అన్నా హజారే డిమాండ్ చేశారు. ప్రస్తుతం ప్రతిపాదించిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వ శక్తి కన్నా ప్రజా శక్తి గొప్పదని ఆయన అన్నారు.

ప్రభుత్వాన్ని కూలదోయడం తమ ఉద్దేశం కాదని, అవినీతిని పారదోలడానికే తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు. పదవిలో ఉన్నంత కాలం ప్రధాని లోక్‌పాల్ పరిధిలోకి రారు. అయితే, ప్రధాని పదవి నుంచి తొలగిన తర్వాత ఆయన లేదా ఆమె తప్పు చేశారనే భావిస్తే దర్యాప్తు జరిపే అవకాశం ఉంటుంది. న్యాయవ్యవస్థ కూడా లోక్‌పాల్ పరిధిలోకి రాదు.

English summary
Team Anna on Thursday began burning copies of the government's version of the Lokpal Bill that was tabled in Parliament today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X