హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరికి ప్రాణం పోసిన కవి 'మో' అవయవ దానం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vegunta Mohan Prasad
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కవి వేగుంట మోహన్ ప్రసాద్ అవయవదానం ఇద్దరు వ్యక్తులకు కొత్త ఊపిరి పోసింది. వేగుంట మోహన్ ప్రసాద్ బుధవారం తెల్లవారు జామున విజయవాడలోని సురక్ష అస్పత్రిలో కన్ను మూశారు. ఆయన మోగా ప్రసిద్ధుడు. ఆయన దానం చేసిన కాలేయం ఓ 45 ఏళ్ల వ్యక్తి ప్రాణాలను కాపాడాయి. మూత్ర పిండాలు మరో 43 ఏళ్ల వ్యక్తికి జీవితంపై ఆశను రేపాయి. హైదరాబాదులోని ఈ వ్యక్తి ఏడాది కాలంగా మూత్రపిండాల మార్పిడి కోసం ఎదురు చూస్తున్నాడు.

వేగుంట మోహన్ ప్రసాద్ అవయవాలను దానం చేయాలని వేగుంట మోహన్ ప్రసాద్ చివరి కోరిక. ఆ మేరకు ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 2వ తేదీన అనుమతి ఇచ్చారు. కాలేయం, మూత్రపిండాల మార్పిడిని హైదరాబాదులోని గ్లోబల్ ఆస్పత్రి చేపట్టింది. కాగా, వేగుంట నేత్రాలను విజయవాడలోని స్వేచ్ఛ గోరా ఐ బ్యాంక్‌కు దానం చేశారు. వేగుంట మోహన్ ప్రసాద్‌ రాసిన నిషాదం రచనకు ఇటీవలే తణికెళ్ల భరణి అవార్డు లభించింది.

English summary
The liver donated by noted poet from Vijayawada Vegunta Mohan Prasad, also known as 'Mo', who was declared brain dead on August 2 at a hospital in Vijayawada came to his rescue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X