సదానంద ప్రమాణానికి 55 మంది రెబల్స్ డుమ్మా

బుధవారం జరిగిన రహస్య బ్యాలెట్‌లో గౌడ జగదీష్ షెట్టర్‌పై గెలుపు సాధించారు. తద్వారా ఆయన బిజెఎల్‌పి నేతగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో షెట్టర్‌కు మద్దతిచ్చిన 55 మంది శాసనసభ్యులు సదానంద గౌడకు సహకారం అందించే విషయంపై అనుమానాలు చెలరేగుతున్నాయి.
తనకు మద్దతు ఇచ్చిన 55 మంది శాసనసభ్యులను షెట్టర్ అల్పాహార విందుకు ఆహ్వానించారు. వారంతా ఈ అల్పాహార విందు సమావేశానికి హాజరవుతారని అంటున్నారు. తన మద్దతుదారులను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడ్యూరప్ప బెదిరించారని ఎన్నికలో ఓటమి పాలైన తర్వాత షెట్టర్ ఆరోపించారు. యడ్యూరప్ప సదానంద గౌడకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే. మీకెవరు ఓటేశారో తనకు తెలుసునని, వారితో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసునని యడ్యూరప్ప అన్నారని షెట్టర్ ఆరోపించారు.












Click it and Unblock the Notifications