తెలంగాణ రాజీనామాలు: కాంగ్రెసు వర్సెస్ తెరాస

రాజీనామాలు చేసిన తర్వాత ఒకరిద్దరు కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్లమెంటు సమావేశాలకు వెళ్లారని కెటి రామారావు తప్పు పట్టారు. కాంగ్రెసు ప్రజాప్రతినిధులు రాజీ డ్రామాలు ఆడుతున్నారని ఇటీవల కందెన మాసపత్రిక ఆవిష్కరణ సభలో తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు వ్యాఖ్యానించారు. రాజీనామాలపై తెలంగాణ ప్రజాప్రతినిధులపై మరింత ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా తెరాస నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నారు.
కాగా, తమ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యుల నాడిని పరీక్షించేందుకు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ ప్రయోగించిన అస్త్రం విఫలమైంది. పార్లమెంటు సభ్యులకు గురువారం కాంగ్రెసు విప్ జారీ చేసింది. లోక్‌పాల్ బిల్లు ప్రతిపాదన, ధరలపై చర్చ నేపథ్యంలో ఈ విప్ జారీ అయింది. అయితే, తెలంగాణ పార్లమెంటు సభ్యులను విప్ ద్వారా భయపెట్టే వ్యూహం కూడా ఉందని అంటున్నారు. అయితే, తెలంగాణ పార్లమెంటు సభ్యుల్లో షురేష్ షెట్కార్ తప్ప మిగతా వారెవరూ సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో తెలంగాణ పార్లమెంటు సభ్యులకు తెరాస వ్యాఖ్యలను ఎదుర్కోవడానికి కొంత నైతిక బలం చేకూరినట్లయింది. కెటి రామారావు చేసిన వ్యాఖ్యకు తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు.












Click it and Unblock the Notifications