తెలంగాణపై టిడిపిని చూపి కాలాయాపన: కావూరి

సుష్మా స్వరాజ్ దేశానికి ప్రతిపక్ష నేతగా కాకుండా తెలంగాణ ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడటం బాధాకరం అన్నారు. తెలంగాణ కోసం అందరు పార్లమెంటు సభ్యులు రాజీనామాలు చేయలేదన్నారు. హైదరాబాదు పరిసర ప్రాంతాలలోని ఎంపీలు రాజీనామాలు చేయలేదన్నారు. దివంగత నెహ్రూ వ్యాఖ్యలను సుష్మా తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. కాకినాడ ప్లీనరీలో తెలంగాణ ఇస్తానని చెప్పిన బిజెపి దానిని ఎక్కడ పెట్టిందని ప్రశ్నించారు. కాగా కావూరికి మాట్లాడటానికి అవకాశం ఇవ్వడంపై బిజెపి ప్రశ్నించడంతో తన విచక్షణాధికారంతో అనుమతి ఇచ్చానని స్పీకర్ మీరా కుమార్ చెప్పారు.












Click it and Unblock the Notifications