చిదంబరం ప్రకటనపై చంద్రబాబు మాట్లాడాలి: కిషన్ రెడ్డి

తెలంగాణపై కాంగ్రెసు పార్టీలో ఏకాభిప్రాయం వస్తుందో లేదో తెలియదు. కానీ ప్రజలు మాత్రం కాంగ్రెసును పారద్రోలాలనే అభిప్రాయంతో ఉన్నారని అన్నారు. కేంద్రం తెలంగాణపై మోసపూరిత ప్రకటనలతో కాలాయాపన చేస్తోందన్నారు. మూడు రాష్ట్రాలు ఇచ్చిన సమయంలో తెలంగాణకు టిడిపి అడ్డుపడిందన్నారు. సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు మభ్య పెట్టి తెలంగాణ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంటు సాక్షిగా ఒకే పార్టీకి చెందిన సర్వే సత్యనారాయణ ఒక రకంగా, కావూరి సాంబశివరావు మరో రకంగా మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు ద్వంద్వ విధానం వీడాలని అన్నారు.


Click it and Unblock the Notifications