'తుపాకీ పట్టుకొని చర్చలంటే ఎలా, ఆ మంత్రులేరి? '

Swamy Goud
హైదరాబాద్: ప్రభుత్వం తీరు తుపాకీ పట్టుకొని చర్చలకు పిలిచినట్లుగా ఉందని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ విమర్శించారు. ఓ వైపు ఎస్మా ప్రయోగిస్తూ మరోవైపు చర్చలు అని అంటే ఎలా అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఏర్పడ్డాకే తమను చర్చలకు పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం మంత్రివర్గ ఉపసంఘంతో తెలంగాణ ఉద్యోగ సంఘాల చర్చలు అర్థాంతరంగా ముగిశాయి. అనంతరం టిఎన్జీవో నేతలు స్వామి గౌడ్, దేవి ప్రసాద్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తాము ప్రత్యేక తెలంగాణ అనే ఏకైక డిమాండుతో ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చామని అయితే ప్రభుత్వం అది తమ పరిధిలో లేదని చెబుతూ సహకరించాలని కోరుతున్నాయని అన్నారు.

తెలంగాణ కేంద్ర పరిధిలో ఉన్నదని చెబుతున్న ప్రభుత్వం తమ పరిధిలో ఉన్న 14ఎఫ్ రద్దు, ఎస్మా ప్రయోగాలపై నిర్ణయం ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ప్రశాంత వాతావరణం కల్పించాకే చర్చలకు వస్తామని మంత్రులకు చెప్పామని అన్నారు. చర్చలకు సానుకూల వాతావరణం ఏర్పడాలంటే అన్ని శాఖలలో ఉన్న పారామిలటరీ దళాలను వెనక్కి పిలవడం, ఎస్మా ప్రయోగాన్ని ఉపసంహరించుకోవడం - ఈ రెండు ప్రభుత్వం చేస్తేనే తాము చర్చలకు వస్తామని చెప్పామని అన్నారు. ప్రభుత్వం వెంటనే 166, 177 ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తమ చర్చల్లో తెలంగాణ ప్రాంత మంత్రులు లేక పోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేసిన శ్రీధర్ బాబు, బస్వరాజు సారయ్య లేరని అన్నారు. సమైక్య వాదులు అయిన ముగ్గురు సీమాంధ్ర మంత్రులతో పాటు తెలంగాణ కోసం రాజీనామా చేయని ఇద్దరు మంత్రులు ఉన్నారని అలాంటప్పుడు తమకు అనుకూలంగా ఎక్కడ ఉంటుందని వారు ప్రశ్నించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+