నేతాజి పద్మనాభుని ఆలయంలో తలదాచుకున్నారా..??

Subhash Chandra Bose
తిరువనంతపురం: కేరళ స్టేట్ ఆర్చివ్స్‌లో బయటపెడ్డ ఓ లేఖ సంచలన రహస్యాన్ని వెలుగులోకి తెచ్చింది. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు నేతాజి సుభాష్ చంద్రబోస్ కేరళ శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయంలో కొంతకాలం తలదాచుకున్నారా..? అన్న అంశం పై అనుమానాలు వ్యక్తంచేసింది. అయితే బయటపడిన ఈ లేఖ పై పలు ఆంగ్ల పత్రికలు కథనాలు ప్రచురించాయి.

పద్మనాభుని ఆలయంలో నేతాజి మారువేషంలో తలదాచుకున్నాడనే అనుమానాలు వ్యక్త మవటంతో బ్రిటీష్ అధికారులు ఆలయ ప్రాంగణంలో నిఘా ఉంచినట్లు బయటపడిన లేఖ ద్వారా తెలుస్తోంది. సుభాష్ చంద్రబోస్ పద్మనాభస్వామి ఆలయంలో ఉన్నట్లు 1941లో ఓ గుర్తు తెలియని వ్యక్తి కోల్‌కతా‌లోని బ్రిటీష్ అధికారులకు లేఖ రాశారు.

వారు ఆ లేఖను అప్పటి మద్రాస్ స్టేట్ రెసిడెంట్ లెఫ్టినెంట్ కల్నల్ జి..పి.మర్ఫీకి పంపించారు. మర్ఫీ ఈ లేఖను ట్రావెన్ కోర్ దివాన్ సర్ సి.పి.రామస్వామి అయ్యర్‌కు పంపించారు. ఆలయంలో అనుమానస్పద వ్యక్తులు కదలికల పై నిఘా పెట్టాలని సూచించారు. కానీ, ఆలయ ప్రాంగణంలో బోస్ ఉన్నట్లు ఆధారాలు లభించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+