సోనియా గాంధీ లేకున్నా విలీనానికి చిరంజీవి ఓకే

చిరు త్వరలో కోర్ కమిటీ సమక్షంలో కాంగ్రెసు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 6 నుండి 10వ తేది మధ్య వీలు చూసుకొని ఢిల్లీ వచ్చి కాంగ్రెసు సభ్యత్వం తీసుకోవాలని వారం రోజుల క్రితం సోనియా నుండి చిరుకు పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆమె అనారోగ్యం కారణంగా చిరు ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ఇదే విషయాన్ని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సైతం సోమవారం చెప్పారు. కోర్ కమిటీ సభ్యులతో పిఆర్పీ విలీనంపై చర్చించానని విలేకరులతో చెప్పారు. ఇప్పటికే విలీనం పూర్తి కావాల్సి ఉన్నప్పటికీ సోనియా ఆనారోగ్యం కారణంగా ఆలస్యమైందని చెప్పారు. చిరు విలీనానికి ఓకే అన్నారని చెప్పారు. కాగా క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా మంగళవారం గాంధీ భవనంలో జాతీయ జెండా పతాకాన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications