వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యడ్యూరప్పకు లోకాయుక్త కోర్టు సమన్లు జారీ

By Pratap
|
Google Oneindia TeluguNews

BS Yeddyurappa
బెంగుళూరు‌: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప కొత్త చిక్కుల్లో పడ్డారు. యడ్యూరప్పతో పాటు మరో 14 మందికి లోకాయుక్త ప్రత్యేక కోర్టు సోమవారం సమన్లు జారీ చేసింది. తన ముందు ఈ నెల 27వ తేదీన హాజరు కావాలని కోర్టు వారిని ఆదేశించింది. తన కుటుంబ సభ్యులకు అనుకూలంగా భూమిని నోటిఫై చేశారనే ఆరోపణలపై యడ్యూరప్పకు, ఇతరులకు ఈ సమన్లు జారీ అయ్యాయి.

యడ్యూరప్పపై, ఇతరులపై న్యాయవాది సిరాజిన్ బాషా లోకాయుక్త కోర్టుకు ప్రైవేట్ ఫిర్యాదు ఇచ్చారు. యడ్యూరప్ప అరకెరే గ్రామంలో 2.5 ఎకరాలను, బెంగుళూర్ దక్షిణ తాలూకాలోని దేవరచిక్కనహళ్లిలో 1.7 ఎకరాలను, బెంగుళూర్ తూర్పు తాలూకాలోని గెదలహళ్లిలో 1.21 ఎకరాలు డీనోటిఫై చేసినట్లు బాషా ఆరోపించారు. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్ అనుమతి ఇచ్చిన తర్వాత బాషాతో పాటు మరో న్యాయవాది కెఎన్ బాలరాజ్ ఫిర్యాదులు చేశారు.

English summary
In fresh trouble for former chief minister BS Yeddyurappa, the special Lokayukta court on Monday issued summons to him and 14 others to appear before it on August 27 in connection with a private complaint against them alleging denotification of lands favouring his family members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X