మావోయిస్టులపై మరో ఏడాది నిషేధం పొడగింపు

కాల్పుల విరమణ ప్రకటించి నక్సలైట్లతో శాంతి చర్చలు జరపడానికి ప్రభుత్వం 2004లో అప్పటి ప్రభుత్వం అప్పటి పీపుల్స్‌వార్‌పై, దాని అనుబంధ సంఘాలపై నిషేధం ఎత్తేసింది. చర్చల సందర్భంలో పీపుల్స్‌వార్ మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ (ఎంసిసి)లో విలీనమై సిపిఐ (మావోయిస్టు)గా ఏర్పడింది.
స్వాతంత్ర్య దినోత్సవం నాడు కాంగ్రెసు శాసనసభ్యుడు సి. నర్సిరెడ్డి, మరో తొమ్మిది మందిని హత్య చేయడంతో ప్రభుత్వం సిపిఐ (మావోయిస్టు)పై, దాని అనుబంధ సంస్థలపై 2005 ఆగస్టు 17వ తేదీన ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ హత్యలతో తొమ్మిది నెలల కాల్పుల విరమణకు, శాంతి చర్చలకు తెర పడింది.












Click it and Unblock the Notifications