క్రాప్ హాలిడేపై ఢిల్లీలో బాబు హల్‌చల్, భేటీలు

ఆంధ్రప్రదేశ్ రైతులు క్రాప్‌హాలీడే ప్రకటించడం తీవ్రస్థాయిలో తీసుకున్న నిర్ణయం అని ఆర్‌ఎల్‌డీ అధ్యక్షుడు అజిత్‌సింగ్ అన్నారు. అజిత్‌సింగ్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైతు సమస్యలు, దేశ రాజకీయాలపై వారు చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎత్తిచూపారని, ప్రభుత్వ యంత్రాంగం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడం లేదని అజిత్‌సింగ్ అన్నారు. దేశవ్యాప్తంగా జరిగే ఉద్యమంలో తాము కూడా భాగస్వాములవుతామని ఆయన అన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌తో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈరాష్ట్రంలో రైతుల పంటవిరామం, లోక్‌పాల్ అంశాలపై మంత్రితో చర్చించారు. రైతుల సమస్యలపై ప్రధానికి, ప్రణబ్ ముఖర్జీకి లేఖలు రాయమని పవార్ చెప్పారని భేటీ అనంతరం బాబు అన్నారు. ఐదు జిల్లాల్లో రైతులు పంటలు చేసేందుకు సిద్ధంగా లేరని, నిరాసక్తిగా ఉన్నారని శరద్‌పవార్‌కు తెలియజేసినట్లు బాబు చెప్పారు. రైతుల నిరాసక్తతపై అధ్యయనం చేసేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలను రాష్ట్రానికి రావాలని కోరానని బాబు తెలిపారు.
బలమైన లోక్‌పాల్ వ్యవస్థ కావాల్సిందేనని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాశ్ కారత్ అన్నారు. ప్రకాశ్‌కారత్‌తో చంద్రబాబుకూడా భేటీ అయ్యారు. లోక్‌పాల్, ఆంధ్రప్రదేశ్ రైతుల సమస్యలపై చంద్రబాబుతో చర్చించినట్లు కారత్ భేటీ అనంతరం తెలిపారు.












Click it and Unblock the Notifications