వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Katta Subramanya Naidu
బెంగుళూరు: కర్ణాటక పారిశ్రామిక అభివృద్ధి మండలి (కేఐఏడీబీ) భూముల కుంభకోణంలో ప్రముఖ నిందితులుగా ఉన్న మాజీ మంత్రి కట్టా సుబ్రమణ్యం నాయుడు, ఆయన కుమారుడు, కార్పొరేటర్ జగదీశ్‌లను సోమవారం సాయంత్రం అరెస్టు చేశారు. అనంతరం వారిని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. వీరిని ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాల్సిందిగా లోకాయుక్త ప్రత్యేక న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో మరొక ప్రముఖ నిందితుడు శ్రీనివాస్‌ను కూడా కస్టడీకి తీసుకోవాలని న్యాయమూర్తి మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు.

కట్టా సుబ్రమణ్యం నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను తోసిపుచ్చిన న్యాయమూర్తి ఈ కేసు తీవ్ర స్వభావం కలిగింది కావడంతో ఈ దశలో జామీను ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మిగిలిన నలుగురు దాఖలు చేసుకున్న జామీను పిటీషన్ స్వీకరించిన న్యాయమూర్తి వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. నిందితులు బసవపూర్ణయ్య, సి.వి.మునిరాజు, మంజు, గోపీలకు కండీషన్ బెయిల్ లభించింది.

న్యాయమూర్తి ఆదేశాలు వెలువరించిన వెంటనే విచారణకు హాజరైన కట్టా సుబ్రమణ్యం నాయుడు, కట్టా జగదీశ్, శ్రీనివాస్‌లను న్యాయస్థానం ఆవరణలోనే లోకాయుక్త పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈకేసులోనే మరో ఇద్దరు నిందితులు జగ్గయ్య, వేమయ్యలు పరారీలో ఉండగా వారి అరెస్టుకు న్యాయమూర్తి వారెంట్ జారీ చేశారు. ఆంధ్ర ప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన కట్టా సుబ్రమణ్యం నాయుడు బెంగుళూరుకు వలస వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు.

అనంతరం రాజకీయంగా ఎదిగి, సంకీర్ణ ప్రభుత్వం అవధిలో మంత్రిగా ఉన్నారు. అనంతరం యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న అవధిలో ఐటి, బిటి, జలమండలి, హౌసింగ్, ఎక్సైజ్ వంటి నాలుగు కీలక శాఖలను ఆయనొక్కరే నిర్వహించారు. అయితే భూ కుంభకోణం ఆరోపణలు రావడంతోటే మంత్రి పదవికి రాజీనామా చేశారు.

English summary
Karnataka ex minister Katta Subramaniam naidu arrested in a land scam yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X