సిఎం జయలలితకు సుప్రీంకోర్టులో చుక్కెదురు

ఏకీకృత పాఠ్యప్రణాళిక పథకాన్ని కరుణానిధి నేతృత్వంలోని డిఎంకె ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే జయలలిత ఆ పథకం అమలును ఏడాది పాటు వాయిదా వేస్తూ చట్టానికి సవరణ తెచ్చారు. పాఠ్యపుస్తకాలు కరుణానిధి ప్రశంసలతో నిండిపోయాయనే ఉద్దేశంతో జయలలిత ఆ నిర్ణయం తీసుకున్నారు.
చట్ట సవరణను హైకోర్టు కొట్టేస్తూ ఏకీకృత పాఠ్యప్రణాళిక పథకాన్ని వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంతకు ముందు ఆదేశించింది. తగిన విధంగా లేదని భావించిన భాగాలను పాఠ్యపుస్తకాల నుంచి తొలగించుకోవచ్చునని సూచించింది. పాఠ్యాంశాలను మార్చాల్సిన అవసరం ఉందని చెబుతూ అందుకు ఏకీకృత పాఠ్య ప్రణాళిక పథకాన్ని ప్రవేశపెట్టడానికి గడువు కావాలని కోరుతూ జయలలిత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది.












Click it and Unblock the Notifications