తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటానని అదృశ్యం

అతను మనోహరాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నాడు. తన ఉద్దేశ్యాన్ని తెలుపుతూ అతను ఓ తెలుగు దినపత్రికకు లేఖ రాసి ఫాక్స్ చేశాడు. గత రెండేళ్లుగా తెలంగాణ ఉద్యమంలో అతను చురుగ్గా పాల్గొంటున్నాడు. అతని అదృశ్యంపై కుటుంబ సభ్యులు పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. అతని తండ్రి నరసయ్య స్వాతంత్ర్య సమరయోధుడు. అతను ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని కోరుకున్నాడు. తన తండ్రి అడుగుజాడల్లో నడుచుకోవాలనేది రమేష్ ఆశయం. సిద్దిపేట శాసనసభ్యుడు హరీష్ రావు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు రమేష్ కుటుంబ సభ్యులను కలిశారు. ఆత్మహత్యలు మార్గం కాదని, వెంటనే తిరిగి రావాలని హరీష్ రావు రమేష్ గౌడ్‌ను కోరారు.












Click it and Unblock the Notifications