హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ వర్గం ఎంపి సబ్బంపై తర్వాత మాట్లాడుతా: బొత్స

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: తమ పార్టీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్‌తో సమావేశమైన తర్వాతనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ వర్గానికి చెందిన తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు సబ్బం హరిపై మాట్లాడుతానని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. జగన్‌కు కోవర్టుగా పని చేస్తున్న సబ్బం హరిని సమావేశానికి ఎందుకు ఆహ్వానించారని కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ కావూరి సాంబశివరావును ప్రశ్నించిన అంశంపై ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.

పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి కమిటీలను రద్దు చేసినట్లు, తెలంగాణ సమస్య తేలిన తర్వాతనే ఆ కమిటీలను వేస్తామని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య పరిష్కారం కోసం పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ మంత్రులు విధులకు హాజరు కాకపోవడం వేరు, స్వాతంత్ర్య దినోత్సవాలకు హాజరు కావడం వేరని ఆయన అన్నారు. ఈ నెల 16వ తేదీన మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేసినట్లు తనకు అధికారిక సమాచారం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు సమ్మెను విరమించుకోవాలని ఆయన కోరారు.

తెలంగాణ సమస్య పరిష్కారానికి చర్చలు జరుపుతున్నామని, ఈ స్థితిలో సానుకూల వాతావరణాన్ని కల్పించి, సమస్యను పరిష్కరించడానికి తోడ్పడాలని, ఇందుకు గాను ఉద్యోగులు సమ్మె నోటీసును ఉపసంహరించుకోవాలని ఆయన అన్నారు. ఈ నెల 20వ తేదీన చిరంజీవి కాంగ్రెసు పార్టీలో చేరుతున్నందున తన తూర్పు గోదావరి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నట్లు ఆయన తెలిపారు.

English summary
PCC President Botsa Satyanarayana said that he wall talk about YS Jagan camp MP Sabbam hari after meeting with Azad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X