జగన్ సాక్షి చానెల్‌పై చంద్రబాబు మండిపాటు

Chandrababu Naidu
న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ కథనంపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కాంగ్రెసు పార్టీవారిని కలవాల్సిన అవసరం తనకు లేదని, తాను కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసినట్లు వచ్చిన కథనంలో నిజం లేదని ఆయన బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ఆ టీవీ చానెల్‌కో మరో పని లేదని, ఇదే పని అని ఆయన అన్నారు. తాను చిదంబరాన్ని కలిసినట్లు తప్పుడు ప్రచారం సాగిస్తోందని ఆయన అన్నారు.

వైయస్ జగన్ ఆస్తులపై సిబిఐ నేరుగా దర్యాప్తు చేయడం లేదని, కోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తు చేస్తోందని, అయినా దేశంలో సిబిఐ తప్ప మరో దర్యాప్తు సంస్థ లేదని, అందుకే తాము లోక్‌పాల్ పటిష్టంగా ఉండాలని అంటున్నామని ఆయన గతంలో తాను సిబిఐని వ్యతిరేకించి ఇప్పుడు జగన్‌పై సిబిఐ దర్యాప్తును ఆహ్వానించడంపై మీడియా ప్రతినిధుల నుంచి వచ్చిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు. దేశంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని, మైనింగ్ మాఫియా గొడ్డలిపెట్టులా మారిందని, ప్రత్యేక ఆర్థిక మండళ్ల పేరుతో దోచుకుంటున్నారని ఆయన విమర్శించారు.

అవినీతిని అరికట్టడంలో ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ విఫలమయ్యారని ఆయన అన్నారు. తాము ఆఫ్రో ఆసియా గేమ్స్‌ను సమర్థంగా నిర్వహించడం వల్లనే దేశానికి కామన్‌వెల్త్ క్రీడలు నిర్వహించే అవకాశం వచ్చిందని, దాంట్లోనూ అవినీతి చోటు చేసుకుందని ఆయన అన్నారు. అవినీతి సొమ్మును రెవెన్యూ ద్వారా రాబట్టాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎక్కడ చూసినా అవినీతే ఉందని ఆయన అన్నారు.

క్రాప్ హాలిడే ప్రకటించిన కోస్తా జిల్లాల్లో వివిధ పార్టీల జాతీయ నాయకులు పర్యటిస్తారని ఆయన చెప్పారు. రైతులు మూడు వేల కోట్ల రూపాయలు నష్టపోయారని ఆయన అన్నారు. రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని ఆయన అన్నారు. వ్యవసాయానికి ప్రభుత్వం మూడు, నాలుగు శాతం కూడా ఖర్చు పెట్టడం లేదని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+