హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మన్మోహన్ కళ్లప్పగించి చూస్తున్నాడు: నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Narayana
హైదరాబాద్: అవినీతి సొమ్ములో ఎక్కువ వాటా కాంగ్రెసు, దాని మిత్ర పక్షాల వద్దే ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ బుధవారం విమర్శించారు. అవినీతి నిర్మూలనపై నారాయణ హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద ఒక్కరోజు దీక్షను మంగళవారం ఉదయం చేపట్టారు. తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత, ప్రజా గాయకుడు గద్దర్, బూర్గుల నర్సింగరావులు నారాయణకు నిమ్మరసం ఇచ్చి బుధవారం ఉదయం దీక్షను విరమింపజేశారు. నారాయతో పాటు దీక్ష చేపట్టిన మరో ముప్పైఒక్క మందిచే దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని కేంద్రం వెంటనే దేశానికి రప్పించాలని డిమాండ్ చేశారు. విదేశాలలో ఉన్న నల్లధనం మన దేశానికి రప్పించడంలో, నల్లధనం దాచిన వారి పేర్లు బయట పెట్టడంలో కేంద్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శించారు.

అవినీతిపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాజకీయ అవినీతి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంచి పేరున్న మన దేశం పరువు కాస్త దిగజారుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. స్వదేశీ నల్లధనాన్ని తెప్పించడానికి ఎందుకు ఆలోచిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రధానిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రభుత్వం తెచ్చిన బిల్లు తల లేని మొండెంలా ఉందన్నారు. దేశంలో ఇంత పెద్ద కుంభకోణాలు జరుగుతున్నా మన్మోహన్ కళ్లప్పగించి చూస్తున్నారని విమర్శించారు.

English summary
CPI state secretary Narayana blamed Prime Minister Manmohan Singh today. He withdrawn his one fast against corruption today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X