మంత్రి పదవుల కోసం గాలి బ్రదర్స్ లాబీయింగ్

అనంతకుమార్‌తో పాటు సీనియర్ బిజెపి నేత తమ అగ్రనేత ఎల్‌కె అద్వానీతో బుధవారం సమావేశమయ్యారు. కర్ణాటక వ్యవహారాలపై ఆయన మాట్లాడారు. తన అనుచరులకు కొంత మందికి సదానంద గౌడ మంత్రివర్గంలో చోటు దక్కేలా చూడాలని అనంత కుమార్ అద్వానీని కోరినట్లు సమాచారం. యడ్యూరప్ప కొలువులో పర్యాటక మంత్రిగా పనిచేసిన గాలి జనార్దన్ రెడ్డి కూడా ఢిల్లీలో మకాం వేశారు. తన అనుచరులకు మంత్రి పదవులు ఇప్పించుకోవడానికి ఆయన కూడా తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది.
లోకాయుక్త నివేదికలో చోటు చేసుకోవడంతో గాలి జనార్దన్ రెడ్డికి, ఆయన సోదరుడు కరుణాకర్ రెడ్డి, వారి అనుచరుడు శ్రీరాములుకు మంత్రివర్గంలో స్థానం లభించలేదు. మంగళవారంనాటి నుంచి సదానంద గౌడ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అద్వానీని, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్‌ను, రాజ్యసభ ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీని కలిశారు.












Click it and Unblock the Notifications