వైయస్ జగన్ ఆస్తుల కేసులో నేడే హైకోర్టు తీర్పు

ఇతరులకు లబ్ధి చేకూర్చడం ద్వారా దానికి ప్రతిఫలంగా జగన్ తన కంపెనీల్లోకి పెట్టుబడులు స్వీకరించారని శంకరరావు లేఖ రాయగా, తెలుగుదేశం పార్టీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక్‌గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, కడప న్యాయవాది కె.కె.షేర్వాణిలు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిసార్ అహ్మద్ కక్రూ, జస్టిస్ విలాస్ వి.అఫ్జల్‌పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం గత వారం ఇరుపక్షాల వాదనలను విని తీర్పును వాయిదా వేసింది. ఈ పిటిషన్‌లపై బుధవారం తీర్పు వెలువరించనుంది. ఈ పిటిషన్లతో పాటు ఎమ్మార్ వ్యవహారాల్లో అవకతవకలపై శంకరరావు రాసిన లేఖను సుమోటో పిటిషన్‌గా విచారణ చేపట్టిన కేసులో కూడా తీర్పు వెలువరించనుంది.












Click it and Unblock the Notifications