హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎమ్మార్‌పై క్రిమినల్ కేసుకు హైకోర్టు ఆదేశాలు

By Pratap
|
Google Oneindia TeluguNews

High Court
హైదరాబాద్: ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక సాక్ష్యాధారులు ఉన్నట్లు తేలిందని ప్రధాన న్యాయమూర్తి నిసార్ అహ్మద్ కక్రూ తీర్పు ప్రతిని చదువుతూ అభిప్రాయపడ్డారు. ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసులో న్యాయమూర్తులు తొలుత తీర్పు ప్రతిని చదివారు. విజిలెన్స్ శాఖకు హైకోర్టు అభినందనలు తెలిపింది. ఎమ్మార్ సంస్థ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందని హైకోర్టు చెప్పింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాలని ఆదేశించింది.

ప్రభుత్వ ఆస్తులను కాపాడడంలో ఎపిఐఐసి, రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యాయని హైకోర్టు విమర్సించింది. ప్రభుత్వ ధనం ఈ వ్యవహారంలో దుర్వినియోగమైందని అభిప్రాయపడింది. ఎమ్మార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని హైకోర్టు సిబిఐ ఆదేశించింది. ప్రభుత్వోద్యోగులు ప్రైవేట్ ఉద్యోగులుగా వ్యవహరించారని చురుకలు అంటించింది. హైకోర్టు తీర్పునకు ముందు కోర్టు వద్ద తీవ్ర ఉత్కంఠ వాతావరణం నెలకొంది. హైకోర్టు హాల్ క్రిక్కిరిసిపోయింది. గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

English summary
High Court ordered for CBI probe on Emaar properties. High court delivered its judgement in Eemar properties case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X