జగన్‌కు షాక్, క్రిమినల్ కేసుకు హైకోర్టు ఆదేశాలు

సమగ్ర విచారణలో ఏవి నీళ్లో, ఏవి నీళ్లో తేలుతుందని హైకోర్టు అభిప్రాయపడింది. జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ సంస్థల్లోకి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయో వాటి మూలాలను తెలుసుకోవాల్సిందేనని అన్నది. కడప న్యాయవాది షేర్వాణి వేసిన పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసింది. జగన్ కంపెనీల్లోని దేశవిదేశీ పెట్టుబడులను ఆరా తీయాలని సూచించింది. ఈ కేసు విచారణార్హం కాదన్న జగన్ న్యాయవాదుల వాదనలతో ఏకీభవించలేదమని హైకోర్టు తేల్చి చెప్పింది.
ప్రస్తుత మంత్రి పి. శంకర రావు, తెలుగుదేశం నాయకులు ఎర్రంనాయుడు, బైరెడ్డి రాజశేఖర రెడ్డి, కడప జిల్లా న్యాయవాది షేర్వాణీ వేసిన పిటిషన్లపై హైకోర్టు తీర్పు వెలువరించింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన సంస్థలను సిబిఐ విచారించి రెండు వారాల్లో సీల్డ్ కవరులో నివేదికను అందజేసింది. మరింత గడువు తీసుకుని ఆ తర్వాత కూడా విచారణ జరిపి అనుబంధ నివేదికను కూడా సిబిఐ కోర్టుకు నివేదించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ప్రాథమిక దర్యాప్తు చేసి ఆ నివేదికలు సమర్పించింది. సిబిఐ పూర్తి స్థాయి దర్యాప్తునకు ఎందుకు ఆదేశించకూడదనే విషయంపై హైకోర్టు విచారణ జరిపింది.












Click it and Unblock the Notifications