కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై ఎఫ్ఐఆర్

ఎగువభ ద్ర ప్రాజెక్టు పనులను మంజూరు చేయించేందుకు మురుడేశ్వర కార్పొరేషన్, అప్పటి ముఖ్యమంత్రి యడ్యూరప్ప కుటుంబీకుల నిర్వహణలో ధవళగిరి ప్రాపర్టీ, సహ్యాద్రి హెల్త్‌కేర్ సంస్థలకు రూ.13 కోట్లను బదిలీ చేసింది. ఇదే సమయంలో తక్కువ రేటుకు బిడ్ చేసిన బ్లాక్ లిస్ట్‌లోని కంపెనీ ఆర్ఎన్ఎస్ ఇన్‌ఫ్రా స్ట్రక్చర్స్‌కు ఈ కీలక కాంట్రాక్టు దక్కింది.
దీనికంటే తక్కువ రేట్ కోట్ చేసిన కి ర్లోస్కర్ కంపెనీ టెండర్ దరఖాస్తును తోసిపుచ్చుతూ అప్పట్లో యడ్యూరప్ప ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆధారాలతో సహా లోకాయుక్త ప్రత్యేక కోర్టులో విధానపరిషత్ సభ్యుడు వై.ఎస్.వి.దత్తా కేసు వేశారు. ఆరోపణలు రుజువు కావడంతో ఈ నెల 8న ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు లోకాయుక్త ప్రత్యేక కోర్టు పోలీసులకు అనుమతి మంజూరు చేసిన సంగతి తెలిసిందే.












Click it and Unblock the Notifications