న్యూఢిల్లీ: ఎర్రకోటపై దాడి కేసులో లష్కరే తోయిబా ఉగ్రవాది మొహ్మద్ ఆరిఫ్‌కు సుప్రీంకోర్టు బుధవారం ఉరిశిక్షను ఖరారు చేసింది. 2000 డిసెంబర్ 22వ తేదీన పాకిస్తానీ జాతీయుడు ఆరిఫ్ ఎర్రకోటపై దాడికి కుట్ర చేశాడు. కింది కోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. మిలిటెంట్లు ఎర్రకోట లక్ష్యంగా సమీపంలోని సైనిక శిబిరంపై దాడి చేశారు. ఈ కేసులో ఆరిఫ్‌కు ఢిల్లీ హైకోర్టు మరణశిక్ష విధించింది దీన్ని అతను సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు. దానిపై సుప్రీంకోర్టు బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది.